అలనాటి సూపర్ స్టార్ జితేంద్ర నేడు 78వ వడిలోకి అడుగుపెట్టాడు. అతను తన ప్రేయసి శోభా కపూర్‌ను 1974లో అక్టోబర్18న వివాహం చేసుకున్నాడు. అయితే దీనికన్నా ముందు అలనాటి అందాల తార హేమమాలినిని పెళ్లి చేసుకోబోయాడు. ఈ విషయాన్ని ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన "హేమ మాలిని: బియాండ్ ద డ్రీమ్‌గర్ల్" పుస్తకం వెల్లడించింది. ఈ పుస్తకం ప్రకారం ఆమె తల్లిదండ్రులకు హేమ, వివాహితుడైన ధర్మేంద్రతో ఉండటం అస్సలు నచ్చేది కాదు. దీంతో ఆమెకు జితేంద్రతో వివాహం జరిపించాలనుకున్నారు. వెంటనే అతని కుటుంబసభ్యులతో మాట్లాడటం, ఇంట్లో వాళ్ల సంతోషం కోసం జితేంద్ర కూడా పెళ్లికి అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ముహూర్తం కూడా ఖరారు చేసుకుని, చెన్నైలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఓ వార్తాపత్రిక ఈ విషయాన్ని చాటింపు చేసి చెప్పింది. దీంతో విషయం తెలుసుకున్న ధర్మేంద్ర్ర, జితేంద్ర ప్రేయసి శోభా(ప్రస్తుతం అతని భార్య)తో కలిసి పెళ్లిని ఆపేందుకు చెన్నైకు పయనమయ్యారు. (ఎంతో నేర్చుకున్నా)
లేకుంటే ఆ హీరోతో హేమ మాలిని పెళ్లి అయ్యుండేది